సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 ఉద్యోగ ఖాళీలు.. పరీక్ష లేకుండా అత్యంత భారీ వేతనంతో?

ఆర్‌ఆర్‌సీ సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1785 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. డిసెంబర్ నెల 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. యాక్ట్ అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28వ తేది ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://iroams.com/rrcser23/applicationafterindex వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వేర్వేరు ఆర్.ఆర్.సీ వర్క్ షాప్ లలో ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

పదో తరగతి, ఐటీఐ మార్కులతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉండగా మిగతా అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. https://www.rrcser.co.in/notice.html వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది.