రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

Job-Vacancy

ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 238 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నరని తెలుస్తోంది. జనరల్ డిపార్ట్ మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సంబంధిత ట్రేడ్ లోఅ ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.

రాత పరీక్ష, సర్టిఫికేట్ల పరీశీలన, మెడికల్ టెస్టుల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.rrcjaipur.in/ వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గ్రేడ్ 2 పే లెవల్ ఆధారంగా వేతనాల చెల్లింపు జరుగుతుందని తెలుస్తోంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేయడం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. ఈ మధ్య కాలంలో రైల్వే నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.