ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 750 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు.. ఒకింత మంచి వేతనంతో?

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. చెన్నైలో ఉన్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి నెల 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి శిక్షణ సమయం ఏడాది మాత్రమే కావడం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మొదట స్టైఫండ్ రూపంలో 10000 రూపాయల నుంచి 15000 రూపాయల రేంజ్ లో స్టైఫండ్ లభించనుంది. ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగానికి పరీక్ష వ్యవధి 90 నిమిషాలుగా ఉండనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 800 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండనుంది. దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. అర్హత ఉన్నవాళ్లు మార్చి నెల 9వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.