ఇండియన్ ఆయిల్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1720 టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 21 నుండి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. నవంబర్ నెల 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని తెలుస్తోంది.

iocl.com అధికారిక వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

సంబంధిత బ్రాంచ్/ట్రేడ్‌లో డిప్లొమా/ఐటీఐ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైన నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.

ఇండియన్ ఆయిల్ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ వరుసగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.