నిరుద్యోగులకు తీపికబురు.. భారీ వేతనంతో ఇండియన్ బ్యాంక్ లో 146 ఉద్యోగ ఖాళీలు!

ఇండియన్ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండగా ఏప్రిల్‌ 1 దరఖాస్తులకు చివరితేదీగా ఉంది.

https://www.indianbank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://ibpsonline.ibps.in/ibsofebr24/ లింక్ ద్వారా సులువుగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 146 పోస్టులలో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌, మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు 175 రూపాయలుగా ఉంది.

ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం చివరి తేదీగా ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వేగంగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.