ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 15 ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిసెంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. indinarmy.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీసం 18 సంవత్సరాల వయస్సు నుంచి గరిష్టంగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ వరకు సమయం ఉన్నా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. అభ్యర్థులు పత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షల తర్వాత ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. ఛాతీ కనీసం 81.5 సెం.మీ ఉన్న అభ్యర్థులు అర్హులు. ఊపిరి పీల్చిన సమయంలో ఛాతీ 85 సెం.మీ ఉండాలి.
బరువు కనీసం 50 కిలోలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లెవల్ 2 కింద పే స్కేల్ రూ.19,900 నుంచి రూ.63,200 వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.