నిరుద్యోగులకు తీపికబురు.. ఎయిర్ ఫోర్స్ లో భారీ వేతనంతో 3500 ఉద్యోగ ఖాళీలు!

మన దేశంలో చాలామంది సైన్యంలో పని చేయాలని భావిస్తుంటారు. అలా సైన్యంలో పని చేయాలని భావించే వాళ్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీపికబురు అందించింది. ఈ స్కీమ్ ద్వారా అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపడుతుండగా పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. agnipathvayu.cdac.in ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఫిబ్రవరి నెల 6వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అప్లై నౌ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకుని ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజును చెల్లించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 2004 జనవరి 2 నుంచి 2007 జులై 2 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్ కనీసం 50 మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 550 రూపాయలుగా ఉంటుంది. ఈ జాబ్స్ కు ఎంపికయ్యే అభ్యర్థులకు 30,000 రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు వేతనం లభించనుంది.