పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.63,200 వేతనంతో?

Job-Vacancy

ఇండియా పోస్ట్ ఈ మధ్య కాలంలో వరుసగ జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు సర్కిల్‌లో ఈ సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 58 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 63,200 రూపాయలు వేతనంగా లభిస్తుందని సమాచారం అందుతోంది. 2023 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

చెన్నై సిటీకి సంబంధించిన వేర్వేరు రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ ను కచ్చితంగా కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. 27 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. కులాల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. భారీ వేతనం లభిస్తుండటంతో పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.