డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 132 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఆగష్టు నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలలో జనరల్ కేటగిరిలో 56 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు సేల్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్‌లో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

https://www.ippbonline.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో కెరీర్స్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్‌ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది.