ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మేనేజర్,డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ipgl.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 17 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ 36,600/ నుండి రూ 62,000/ వరకు వేతనం లభించనుంది. హ్యూమన్ రిసోర్స్ స్ట్రీమ్ లో పీజీ చేసిన వాళ్లు డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాలకు అనుగుణంగా వేతనంలో మార్పులు ఉంటాయి. సంస్థ మజ్‌గావ్, ముంబై 400010 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.