తమలపాకును ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల్లో మాత్రమే ఉపయోగిస్తారు అన్న అపోహ చాలామందిలో ఉంది. అయితే తమలపాకులో మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. తమలపాకులో ఉన్న ఔషధ గుణాలను గ్రహించిన మన పూర్వీకులు వివాహం, విందు కార్యక్రమాల్లో భోజనం చేసిన వెంటనే తమలపాకు తాంబూలాన్ని ఇవ్వడం సాంప్రదాయంగా పెట్టారని చెప్పవచ్చు. తమలపాకు వల్ల ఉపయోగాలు వాటిలో ఉన్న పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకు రసం మిర్యాల పొడి తో కలిపి రోజుకు రెండు టీ స్పూన్లు తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ సి ,యాంటీ వైరస్ ,బ్యాక్టీరియల్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు. అలాగే గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తమలపాకు కషాయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
తమలపాకు మంచి యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల త్వరగా వృద్ధాప్యపు ఛాయలు దరి చేరవు. తమలపాకులో చెవికాల్ అనే పదార్థం ఉంటుంది ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేసి బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
స్థూలకాయంతో బాధపడేవారు తమలపాకులు మిరియాలు కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.తమలపాకులో
ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో జీనక్రియను మెరుగుపరిచి పీచు పదార్థం అధికంగా ఉంటుంది కావున భోజనం చేసిన తర్వాత తాంబూలంగా వేసుకోవడం మంచిది.
తమలపాకును తాంబూలంగా తీసుకున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.పరిమితికి మించి తమలపాకుతో సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం హానికరంగా మారుతుందని గ్రహించాలి.తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవటం మంచిది.