రాగి చెంబుతో ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీ సొంతం.. ఇక పట్టిందల్లా బంగారమే!

డబ్బు ఎంత సంపాదించినా అనవసర ఖర్చు, అనవసర పనుల వల్ల వృధా అవుతుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొదటగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే నీటిలో కాస్త రాయి ఉప్పు, పసుపు వేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండే ఆస్కారం ఉండదు. తరువాత ఒక పీఠను తీసుకొని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి ఇంట్లో ఈశాన్యం వైపు ఒక మూలలో ఉంచాలి.

ఆ పీటపై కుబేర ముగ్గును వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి.తర్వాత ముగ్గు మధ్యలో ఒక తమలపాకును ఉంచి అందులో పసుపు కుంకుమ కాస్త అక్షింతలు వేసి దానిపై ఒక రాగి లేదా ఇత్తడి చెంబును ఉంచాలి. ఈ చెంబును మచ్చలు మురికి లేకుండా శుభ్రంగా కడిగితేనే ఫలితం అనేది కనిపిస్తుంది. తర్వాత ఆ చెంబుకు ఐదు లేదా మూడు చోట్ల పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ చెంబును తమలపాకు పై పెట్టి అందులో అప్పుడే తెచ్చిన నిండుకుండలోని నీటిని వేయాలి.

చెంబు నిండా నీరు పోసిన తర్వాత అందులో కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చ కర్పూరం, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఒక రాగి నాణెం లేక చలామణిలో ఉన్న ఒక రూపాయిని చెంబులో వేయాలి. తర్వాత ఆ చెంబు పై కొన్ని రకాల పూలను ఉంచుకోవాలి. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం లేదా తిధి బాగా ఉన్న రోజు ప్రారంభించుకోవాలి. ఆ చెంబుకు ఎదురుగా ఒక రాగి పళ్లెం ఉంచి అందులో ఐదు పిడికిల వరకు మొలకెత్తిన నవధాన్యాలను వేసి ఇత్తడి లేదా రాగి ప్రమిదను ఉంచాలి.

అవి వీలుకాకుంటే మట్టి ప్రమిదను అయినా ఉంచవచ్చు. అందులో నూనె వేసి రెండు వత్తులను ఒకే ఒత్తి లాగా కలిపి ఆ ప్రమిదలను పసుపు కుంకుమలతో బొట్ల లాగా పెట్టుకోవాలి. ఈ పళ్లెంలో కొన్ని పూలు, ఒక పసుపు కొమ్ము తీసుకొని దానికి కుంకుమ రాసి నవధాన్యాలపై ఉంచాలి. ఈ రాగి చెంబును ఇత్తడి పల్లెని సోమవారం లేదా గురువారం మాత్రమే శుభ్రపరచుకోవాలి. మనం వెలిగించిన దీపాన్ని రోజుకు రెండు పూటలా శుభ్రపరచుకొని వెలిగించి పూజించుకోవాలి. తర్వాత దీపారాధన చేయాలి.