భాద్రపద మాసం లో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. మామూలుగా అయితే వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు అంటారు. ఎందుకంటే చంద్రుడిని చూస్తే అపనిందల పాలు కావలసి వస్తుంది. శ్రీకృష్ణుడు అంతటివాడే అపనిందను మోసాడని కథలుగా చెప్పడం మనం వినే ఉంటాము.
ఆ తరువాత వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు 16 కళ లతో నిండుకుండ లాగా దర్శనం ఇస్తాడు అని పురాణాలలో చెప్పబడింది. మరి ఇంత విశిష్టత ఉన్న పౌర్ణమి రోజున ఒక పూజ చేసి మన సమస్యలు పూర్తిగా తొలగించుకొని, సిరి సంపదలతో వెలగవచ్చు అనేది వాస్తవం. మరి ఈ పౌర్ణమి రోజున చక్కగా శివుడికి, విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తే సరిపోతుంది.
ఉదయం పూట అయితే తెలుపు రంగు పూలతో,మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏవైనా ఎరుపు రంగు పూలతో, ఇక సాయంత్రం అయితే నందివర్ధనం, గరుడవర్ధనం అనేది చాలా వరకు ఇండ్లలో ఉంటాయి కుదరకపోతే ఏవైనా తెలుపు రంగు పూలతో చక్కగా పూజ చేసుకోవాలి.
తరువాత ఉదయం లేదా సాయంత్రం వేళలో 11 దోసకాయలను విగ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి సమర్పించితే మంచిది. ఎందుకంటే విఘ్నేశ్వరుడు గజముఖంతో ఉంటాడు కాబట్టి ఆయనకు దోసకాయలు అంటే ఎంతో ప్రీతి. ఇష్టంగా తింటాడు. కాబట్టి 11 కుదరకపోతే కనీసం ఐదు దోసకాయల అన్న సమర్పించాలి. 11ను కలిపితే 2 వస్తుంది చంద్రునికి సంకేతం 2. ఒకవేళ కుదరదు కాబట్టి ఐదు దోసకాయలైన సమర్పించాలి.
ఉదయం ఏమైనా పనుల వల్ల కుదరకపోతే సాయంత్రం తలస్నానం, లేదంటే సూచి స్నానమైన చేసి విగ్నేశ్వరుడి గుడికి వెళ్ళవచ్చు. అక్కడ సమర్పించిన దోసకాయలను పూజారి ప్రసాదం రూపంలో ఇస్తే వాటిని ముక్కలు చేసుకుని తినవచ్చు, లేదంటే వంటలోనైనా వాడుకోవచ్చు.
ఒకవేళ గుడికి వెళ్లడానికి వీలుకాకపోతే ఇంట్లోనే పూజ చేసి వాటిని శుభ్రంగా వాడుకోవచ్చు. ఇలా చేస్తే మరలా సంవత్సరం వచ్చేవరకు విజ్ఞేశ్వరుడు మనకు ఏ విధమైన విజ్ఞానాలు, ఆటంకాలు రాకుండా కాపాడాతాడని పురాణాలలో స్పష్టంగా వివరించడం జరిగింది.