రుద్రాక్ష విశేషాలు ఇవే !

రుదాక్ష.. హిందుమతంలో అత్యంత పవిత్రమైన వస్తువులలో ఒకటి. శివుడి నుంచి ఏర్పడిని వీటిని శక్తివంతమైనవిగా వీటిని భావిస్తారు. వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. వీటిలో ఒక ముఖం నుంచి అనేక ముఖాలు ఉన్న రుద్రాక్షలు ఉంటాయి. వాటి గురించి వాటివల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం…
ఏకముఖి రుద్రాక్ష


ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రతిరూపం. శివుని త్రినేత్రముగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
ద్విముఖి
ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. శివపార్వతి రూపంగా నమ్ముతారు. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
త్రిముఖి
త్రిముఖి రుద్రాక్షను త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
చతుర్ముఖి
చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు వేదాల స్వరూపం. ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరమవుతాయి. విద్యార్ధులకు మరింతా ఉపయోగం.
పంచముఖి
పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం. గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిది. ఇది పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాదు శతృవులను సులభంగా జయించవచ్చు.
షణ్ముఖి
షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులు దూరమవుతాయి.
సప్తముఖి
సప్తముఖి రుద్రాక్ష కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని విశ్వాసం.
అష్టముఖి
అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
నవముఖి
నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపము. ఇది భైరవునికి ప్రతీక. దీనిని ఎడమ చేతికి ధరించాలి. దుర్గ ఆరాధకులకు మంచిది.
దశముఖి
దశముఖి రుద్రాక్ష దశావతార స్వరూపము. ఇది జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగము చేసినంత ఫలితము కలుగుతుంది. దీనిని మహిళలు ఎక్కువగా ధరిస్తారు.
ఏకాదశముఖి
ఏకాదశముఖి రుద్రాక్ష 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.
ద్వాదశముఖి
ద్వాదశముఖి రుద్రాక్ష 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.
త్రయోదశముఖి
త్రయోదశముఖి రుద్రాక్ష కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను తాగితే అందం పెరుగుతుంది.
చతుర్దశముఖి
చతుర్దశముఖి రుద్రాక్ష 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమ శివుని కన్ను.
పంచదశముఖి
పంచదశముఖి రుద్రాక్ష పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
షోడశముఖి
షోడశముఖి రుద్రాక్ష 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.
సప్తదశముఖి
సప్తదశముఖి రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక. దీని వల్ల ఆర్థిక సంపద కలుగుతుంది.
అష్టాదశముఖి
అష్టాదశముఖి రుద్రాక్ష 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
ఏకోన్నవింశతిముఖి
ఏకోన్నవింశతిముఖి రుద్రాక్ష 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.
వింశతిముఖి
వింశతిముఖి రుద్రాక్ష 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.
ఏకవింశతిముఖి
ఏకవింశతిముఖి 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. అంతేకాదు జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.