సాధారణంగా నిద్రలేచిన తర్వాత కొంతమందికి దేవుడి చిత్రపటాన్ని చూడటం అలవాటు. ఇలా ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటో చూడటం వల్ల అంతా శుభం జరుగుతుందని ప్రజల నమ్మకం. అయితే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు చేయటం వల్ల జీవితం మొత్తం ఎంతో ఆనందంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. రాత్రంతా కళ్ళు మూసుకుని నిద్రపోవటం వల్ల మన కళ్ళల్లో కేంద్రీకృతమైన శక్తి ఉదయం లేవగానే మనం మొదట చూసిన వస్తువు మీదకు వెళుతుంది. అందువల్ల ఉదయం మెలకువ వచ్చిన తర్వాత రెండు చేతులను వృద్ధి కళ్ళకు అడ్డుకొని ” కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం” అనే మంత్రం పలికి ఆ తర్వాత మన అరచేతులను చూసుకోవాలి.
• ఆ తర్వాత నేల మీద కాలు పెట్టేటప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమాతకు దండం పెట్టి ” ” సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే! విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే!! ” అనే శ్లోకాన్ని పఠించి భూమాతకు నమస్కరించాలి.
• ఆ తర్వాత మనం స్నానం చేసే ముందు ఆ నీటిని ఒకసారి తాకి ” గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు! ” అనే మంత్రాన్ని పలుకుతూ మనం స్నానం చేసే నీటిలోకి అన్ని నదుల గంగాజలం వచ్చి చేరినట్లు భావించి ఆ నీటి రూపంలో భగవంతుడు మన దేహాన్ని శుద్ధి చేస్తున్నట్లు భావించాలి.
• ఇక స్నానం చేసిన తర్వాత మొదటగా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కరిస్తూ
“ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర !
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!
సప్తశ్వ రాధమారూడం ప్రచండం కశ్యపాత్మజం!
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం! ” అనే మంత్రాన్ని జపించాలి
ఇలా సూర్య భగవానుడికి నమస్కారం చేసిన తర్వాత యధావిధిగా ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించాలి ఆ తర్వాత గురువులకు తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారి ఆశీర్వాదాలు పొంది జీవితం ఎంతో ఆనందంగా, సుఖంగా ఉంటుంది.