Mahesh Babu: మరోసారి తన మంచితనాన్ని బయటపెట్టిన సూపర్ స్టార్…నెల రోజుల చిన్నారికి ప్రాణదానం!

Mahesh Babu: సాధారణంగా హీరోలు సినిమాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చూపిస్తారు అయితే చాలా మంది హీరోలు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది ప్రేమాభిమానాలను ఆశీర్వాదాలను అందుకుంటున్నారు. ఇలా పేదలకు తమదైన శైలిలో సహాయం చేసే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికి ఎంతో మంది పిల్లల ప్రాణాలను కాపాడారు.

తాజాగా నెలల వయసున్న ఒక చిన్నారికి విజయవంతంగా గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టే మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ క్రమంలోనే జాంబవంతుల శిరీష అనే మహిళకు జన్మించిన నెల వయసున్న చిన్నారికి ఆంధ్ర హాస్పిటల్ వారి సహాయంతో చిన్నారికి ఎంతో విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశారు.ఇలా ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇలా మహేష్ బాబు ఎంతో మంది ప్రాణాలను కాపాడినట్లు ఈ సందర్భంగా నమ్రత తెలిపారు. ఇలా మహేష్ బాబు పిల్లల ప్రాణాలను కాపాడిన సంఖ్య 1059 కి చేరుకుంది. ఇలా చిన్నారికి విజయవంతంగా సర్జరీ నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్ వైద్య సిబ్బందికి నమ్రత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆ చిన్నారి తొందరగా ఈ సమస్యనుంచి కోలుకోవాలని నమ్రత ప్రార్థించారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది మహేష్ అభిమానులు దటీజ్.. మహేష్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు