లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేయాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే!

మనలో చాలామంది డబ్బు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. కొంతమంది సులువుగానే డబ్బు సంపాదిస్తే మరి కొందరు మాత్రం డబ్బు సంపాదించే విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొన్ని పనులు చేయడం ద్వారా మనం డబ్బును సులువుగానే సంపదించడం సాధ్యమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే తక్కువ సమయంలోనే డబ్బును సంపాదించవచ్చు.

 

ప్రతిరోజు కనకధార, లక్ష్మీమాలలను జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిరోజూ సూర్యభగవానుడిని నమస్కరించడంతో పాటు సూర్యునికి రాగి పాత్రలో నీటిని నింపి ఎర్రటి పూలు, అక్షత, కుంకుమతో సమర్పిస్తే మంచిది. నిద్రలేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేయడం ద్వారా కూడా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.

 

నిద్ర లేచిన వెంటనే అరచేతులను చూసుకుంటూ రెండు చేతులతో కళ్లను నొక్కితే మీరు అనుకున్నది కచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. తెల్లవారుజామున నిద్ర లేచేవాళ్లు వాళ్లు అనుకున్న లక్ష్యాలను సులువుగా సాధించగలరు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 

దేవుడి గదిని శుభ్రం చేసి ప్రతిరోజూ పూజ చేయడం ద్వారా కూడా దేవుని అనుగ్రహం కచ్చితంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దేవుని గదిని శుభ్రంగా ఉంచుకుని పూజలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందే ఛాన్స్ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని భావించేవాళ్లు ఈ చిట్కాలను పాటిస్తే మాత్రం కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు.