జుట్టు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఇది మీకోసమే!

ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యలతో బాధపడేవారు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని జన్యుపరమైన లోపాలు కూడా వీటికి తోడవుతాయి. హెయిర్ గ్రోత్ కు మాత్రం జన్యుపరమైన రూపాలు ఉంటాయని వైద్యం నిపుణులు సూచిస్తుంటారు. మిగతా సమస్యలకు కాలుష్యం, ఆహారాలవాట్ల మార్పు కారణం.

మన ఇండ్లలో సహజంగా ఉండే మెంతులతో జుట్టు సమస్యలను చక్కగా పరిష్కరించుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు స్పూన్ల మెంతులు కాస్త నీరు వేసి రాత్రి నానబెట్టాలి. ఏడు లేదా ఎనిమిది గంటల తర్వాత ఆ మెంతులను ఆ నీటితో కలిపి మిక్సీ వేయించాలి. తరువాత అందులో నాలుగు లేదా ఐదు మందారపు ఆకులు వేయాలి.

మందారపు ఆకులలో రెండు మూడు రకాలుగా ఉంటాయి. ఐదు ఆకుల మందార పువ్వు ఉండే మొక్క నుండి గ్రహించిన ఆకులను వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకులను వేసినాక వచ్చిన పేస్టును ఈ విధంగా తనకు అప్లై చేసుకోవాలి.

మొదట మనం హెయిర్ కి ఆయిల్ పెడుతున్నట్లయితే ఇందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. లేకపోతే మనం వాడే ఇతర నూనెలో ఆముదం, ఆల్మండ్ ఆయిల్ ఉన్నట్లయితే అవి కాకుండా వేరే ఏదైనా ఇందులో వాడవచ్చు.
ఒకవేళ ఆయిల్ పెట్టె అలవాటు లేనట్టయితే ఇది అప్లై చేయడానికి కనీసం గంట ముందు కాస్త తలకు కొబ్బరి నూనె అప్లై చేస్తే మంచిది.

ఆ తరువాత దీనిని తలకు బాగా కుదుల వరకు పట్టే విధంగా అప్లై చేసుకుని బాగా ఆరిన తర్వాతనే శుభ్రంగా కడుక్కోవాలి. మెంతులు అనేటివి వెంట్రుకలలో జుడ్డు, మలినం, లాంటివి పోగొట్టే మంచి పోషకాలు ఇందులో ఉంటాయి. మందారం ఆకులో కూడా జుట్టుకు పోషనిచ్చిన ఇచ్చే లవణాలు పుష్కలంగా ఉండి జుట్టు రాలడానికి ఉపయోగపడుతుంది.