జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

జుట్టు రాలడం, జుట్టు తెల్లగా మారడం అనేది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. ఈ సమస్య చాలా మందిలో సర్వసాధారణం అయిపోయింది. దీనికి ఆహార లోపం, సరియైన నిద్ర, వత్తిడి, టెన్షన్స్ వంటి కారణాలు చాలానే ఉన్నాయి. పెద్దవారికి అయితే పర్వాలేదు కానీ చిన్న వయసు నుండే ఇలా జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు రావటం వల్ల మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగించడం వల్ల అందులోని కెమికల్స్ సమస్య తీవ్రతను పెంచుతాయే తప్ప అనుకున్నంత ఫలితం మాత్రం లభించదు. కెమికల్స్ లేకుండా సాధారణ సహజ పద్ధతిలో తయారు చేసుకునే ఇంటి చిట్కాల ద్వారా చక్కటి ఫలితం పొందవచ్చు.

ముందుగా కొంత కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి, వాటి ఆకులను తుంచి తడి లేకుండా చూసుకోవాలి. ఒక బాని తీసుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో ఉంచి అందులో ఈ కరివేపాకు ఆకులను వేసి నల్లగా మాడిపోయే రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మాడిన కరివేపాకులు కరివేపాకు ఆకులను పౌడర్ లాగా చేసుకోవాలి. తరువాత మనకు తగినంత పౌడర్ ను ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక స్పూన్ అలోవెరా ను వేయాలి.

కావాలంటే అలోవెరాను సహజంగా కూడా పొందవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే అలోవెరా పేస్ట్ ను వాడుకోవచ్చు. తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. కావాలంటే కాస్త నూనె ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తయారైన కరివేపాకు మిశ్రమాన్ని తలకు పట్టించి కుదుళ్లకు అంతా తాకేలా వేళ్ళతో చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత అంటే కనీసం ఒక అరగంట తర్వాత మంచినీళ్లతో తలని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకేముంది జుట్టు నల్లగా మారడమే కాకుండా ఒత్తుగా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు. ఇటువంటి గృహ చిట్కాల వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి దరిచేరవు.