డిగ్రీ అర్హతతో 9,053 ఉద్యోగ ఖాళీలు.. ఏకంగా 44,000 రూపాయల వేతనంతో?

దేశంలోని నిరుద్యోగులకు ఐబీపీఎస్ తీపికబురు చెప్పింది. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ నెల 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. డిగ్రీ అర్హతతో ఏకంగా 9,053 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ 2, 3 స్థాయి ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

 

https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) ఉద్యోగ ఖాళీలు 5650 ఉండగా మిగతా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.15,000 నుంచి ఏకంగా 44,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో ఈ వెబ్ సైట్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామకాలు జరగనున్నాయి.

 

ఆగస్ట్ 5, 6, 12, 13, 19 తేదీలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. స్కేల్ 2, స్కేల్ 3 పరీక్షలు మాత్రం సెప్టెంబర్ నెల 10వ తేదీన జరగనున్నాయని సమాచారం అందుతోంది. అర్హత సాధించిన వాళ్లు నవంబర్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.