నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు?

ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి తాజాగ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం చేయాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌, డిగ్రీ చదివిన వాళ్లు మాత్రమే అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు.

 

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జూన్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండటం గమనార్హం. జూన్ 27వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించాలి.

 

100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్ష జరగనుందని తెలుస్తోంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూతో పాటు ఇతర పరీక్షలను నిర్వహిస్తారని సమాచారం. అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

 

27 సంవత్సరాల వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. mha.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.