ప్రస్థుత కాలంలో వాతావరణ కాలుష్యం, పెరిగిపోతున్న ఇంధన ధరల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో వాహనాల తయారీ సంస్థలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలలో ఒకటైన హ్యుందాయ్ సెకండ్ జనరేషన్ కోనా ఎలక్ట్రిక్ కారుని మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే హ్యుందాయ్ కోన ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ ని వెల్లడించింది. ఇక ఇప్పుడు పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లను గురించి చెప్పుకొచ్చింది.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 48.4kWh బ్యాటరీ, మరొకటి 65.4kWh బ్యాటరీ. 48.4kWh బ్యాటరీ 153 హెచ్‌పి 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 65.4kWh బ్యాటరీ 215 హెచ్‌పి మరియు 255 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే భారతదేశంలో 39.2kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక రేంజ్ విషయానికి వస్తే లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 490 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కిమీ ప్రయాణం చేయగలిగే దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంటుంది. అయితే ఖచ్చితమైన రేంజ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కారు పరిధి వాస్తవ ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది. హ్యుందాయ్ కోనా లో ఎలక్ట్రిక్ స్లిమ్ ర్యాప్‌రౌండ్ ఫ్రంట్ లైట్ బార్, క్లామ్‌షెల్ బానెట్, ముందు & వెనుక వైపు ఫంక్షనల్ ఎయిర్ ఇన్‌టేక్స్, గ్రిల్స్, స్కిడ్‌ప్లేట్ వంటివి ఉన్నాయి. అలాగే పరిమాణం పరంగా చూసినా కూడా ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలాగే ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ ఆధునికంగా ఉంటాయి.