హైదరాబాద్‌లోని నిజాం ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం జూన్ 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. విద్యార్హత,జీతం,ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
అనస్థీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, గైనకాలజీ, వైద్య ఇమ్యునాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జెనెటిక్స్, హేమటాలజీ విభాగాలతో పాటు మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ,రేడియాలజీ అండ్ ఇమేజియాలజీ, న్యూరాలజీ, రేడియేషన్ అంకాలజీ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. సంబంధిత స్పెషాలిటీలో ఎండీ, ఎంఎ్స్, డీ.ఎన్.బీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.1,21,641 వేతనం లభించనుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామాకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.