నిరుద్యోగులకు తీపికబురు.. భారీ వేతనంతో రైల్వే గ్రూప్ డీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారా?

భారతీయ రైల్వేలో పని చేయాలని దేశంలో ఎంతోమంది నిరుద్యోగుల ఆకాంక్ష కాగా అలా పని చేయాలని భావించే వాళ్లకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురును అందించింది. పశ్చిమ రైల్వే గ్రూప్ సి, డి ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రైల్వే శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. rrc-wr.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

నవంబర్ నెల 10వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2023 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రూప్ సి ఉద్యోగ ఖాళీలు 21 ఉండగా గ్రూప్ డి ఉద్యోగ ఖాళీలు 43 ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. పదో తరగతి తర్వాత ఐటీఐ లేదా అప్రెంటీస్ కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండగా ఆ ఫీజులో 400 రూపాయలను తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు వికలాంగులు, మాజీ సైనికులు, మహిళలు, మైనారిటీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.