డిగ్రీ, పీజీ అర్హతతో భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి శుభవార్త వచ్చింది. 50కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ తాజాగా నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కొరకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ada.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 53 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 2023 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 ఉద్యోగ ఖాళీలు 40 ఉండగా ప్రాజెక్ట్ ఇంజనీర్ 2 ఉద్యోగ ఖాళీలు 9, ప్రాజెక్ట్ ఇంజనీర్ 3 ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్‌డి డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఒక్కో పోస్టుకు గరిష్ట వయోపరిమితి ఒక్కో విధంగా ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.

ada.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో రిక్రూట్మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థుల వివరాలను నింపి అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయడం ద్వారా కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 70,000 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.