న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మెడికల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 60,000 రూపాయల మేర వేతనం లభించనుంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వైద్య సేవల విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నాయి. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపులు లభిస్తాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థుల పనితీరు ఆధారంగా పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు అయితే ఉంటాయి. nmdc.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.