మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వాళ్లకు బెనిఫిట్ కలిగేలా ఈ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలతో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా 2023 సంవత్సరం ఆగష్టు నెల 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
మొత్తం 88 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో సూపర్‌వైజర్ (ఆపరేషన్) ఉద్యోగ ఖాళీలు 26 ఉండగా మెయింటెయినర్ ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి. సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా మెయింటెయినర్ (ట్రాక్షన్) ఉద్యోగ ఖాళీలు 9, సూపర్‌వైజర్ (ట్రాక్షన్) ఉద్యోగ ఖాళీలు 8, మిగిలిన ఉద్యోగ ఖాళీలు ఒక్కో విభాగంలో 2 చొప్పున ఉన్నాయని తెలుస్తోంది.
మిగిలిన ఉద్యోగాలలో హెచ్‌ఆర్ అండ్ అకౌంట్స్ ఉద్యోగ ఖాళీలతో పాటు స్టోర్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ (ట్రాక్) ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పది, ఇంటర్, ఐటీఐ, ఇంజనీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉన్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా 20,000 రూపాయల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది.
18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉండగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉన్న నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.