హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. hindustanpetroleum.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను సైతం అధికారిక వెబ్ సైట్ ద్వరా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
అధికారిక వెబ్ సైట్ లో జాబ్ ఓపెనింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వివరాలను నింపిన తర్వాత రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ 2023 – 24 ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలతో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుండగా ఎక్కువ మొత్తం వేతనం పొందాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై ప్రత్యేక దృష్టి పెడితే మంచిది.