ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ వెలువడుతుండగా ఈ జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డిపార్ట్‌మెంట్స్‌లో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు పదో తరగతి అర్హతగా ఉండగా మరికొన్ని ఉద్యోగ ఖాళీలకు మాత్రం డిగ్రీ అర్హత ఉండాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం 8,326 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో 4,887 ఎంటీఎస్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 3,439 హవల్దార్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ జాబ్ నోటిఫికేషన్ ను సైతం రిలీజ్ చేసింది. మొత్తం 17,727 ఖాళీలు ఉండగా జులై 25 వరకు రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
గ్రూప్ బి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, అలాగే గ్రూప్ సి స్టాఫ్ ఉద్యోగాలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, వివిధ ట్రేడ్స్‌లో అప్రెంటీస్‌షిప్ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ddpdoo.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆసక్తి ఉన్నవారు జులై 13 లోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లను మెరిట్ ద్వారా భర్తీ చేస్తారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.