వేడినీటితో స్నానం చేయడం వల్ల ఇన్ని నష్టాలా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది వేడినీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం చాలామంది ఇష్టపడతారు. వేడి నీటి స్నానం చెయ్యడం వల్ల రక్త ప్రసరణ మెరుగయ్యే అవకాశంతో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చర్మ ఆరోగ్యానికి మాత్రం వేడినీటి స్నానం వల్ల నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మం, జుట్టుపై ఉండే సహజసిద్ధమైన నూనెలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. జుట్టు ఎక్కువగా పొడిబారితే ఊడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వేడినీటి స్నానంతో జుట్టుపై ఉండే సీబమ్ అనే కొవ్వు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మరీ వేడినీటితో స్నానం మంచిది కాదని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బును వాడటం ద్వారా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మానికి పూర్తిస్థాయిలో రక్షణ కలుగుతుందని చెప్పవచ్చు. చలికాలంలో ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. చర్మం విషయంలో తప్పులు చేస్తే మాత్రం తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

మరీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం కమిలిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చలికాలంలో వేడినీటితో స్నానం చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. వేడినీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో లాభాలను పొందవచ్చు.