నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీ వేతనంతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో జాబ్స్!

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. hindustancopper.com వెబ్ సైట్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 56 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

జులై 21వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వేర్వేరు విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుండటం గమనార్హం. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్ప వచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. ఇతర కేటగిరీల అభ్యర్థులు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 30,000 నుండి రూ. 120,000 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుంది. పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ధృవీకరణ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం అందుతోంది. అర్హతలు ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది.