ఖర్జూరం విత్తనాల కాఫీని ఎప్పుడైనా తాగారా.. ఈ కాఫీ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!

మనలో చాలామంది ఖర్జూరంను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. మహిళలు ఖర్జూరం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లభిస్తాయని చెప్పవచ్చు. ఖర్జూరంలో ఉండే విటమిన్స్, మినరల్స్ వల్ల కూడా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క ఖర్జూరం తిన్నా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుందని చెప్పవచ్చు.

ఖర్జూరం విత్తనాలతో కాఫీ తయారు చేస్తారని చాలా తక్కువమందికి తెలుసు. ఖర్జూరం విత్తనాలతో కాఫీ పౌడర్ తయారు చేయడానికి ఖర్జూరం విత్తనాలను సేకరించి ఆ విత్తనాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సన్నని మంటపై వాటిని వేయించి సువాసన వచ్చే వరకు వేగిన విత్తనాలను చల్లారనివ్వాలి. ఆ విత్తనాలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఖర్జూరం విత్తనాల కాఫీ పౌడర్ తయరైనట్టేనని చెప్పవచ్చు.

సాధారణ కాఫీ, టీ పొడికి బదులుగా ఈ విత్తనాల కాఫీ పౌడర్ ను వాడవచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడే వారు ఖర్జూరం విత్తనాలతో తయారు చేసిన కాఫీ తాగితే బరువు తగ్గడంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఖర్జూరం విత్తనాలు ఉపయోగపడతాయి. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్నవారు ఖర్జూరం విత్తనాల కాఫీ తాగడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

డయాబెటిస్ తగ్గించడంలో కూడా ఖర్జూరం విత్తనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఖర్జూరం విత్తనాల కాఫీ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సైతం కంట్రోల్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది.