చర్మంపై తరచూ ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

కొన్ని ఆరోగ్య సమస్యలను చిన్న సమస్యలు అని మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఆ ఆరోగ్య సమస్యలే దీర్ఘకాలంలో హాని చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద వల్ల మనలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. మెడ, ముఖం, చేతులు, అరికాళ్లు మరియు చేతులు, ప్రైవేట్ భాగాలలో దురద సమస్య వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

ఈ ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో కొన్ని హోం రెమిడీస్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. సింథటిక్ బట్టలు, వేడి, అధిక తేమ కూడా కొన్ని సందర్భాల్లో దురదకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాతావరణంలో వచ్చే కీలక మార్పులు సైతం దురద సమస్యను పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

దురదలు, దద్దుర్లు సమస్య వేధిస్తే వంటగదిలో ఉండే పసుపును వినియోగించాలి. పసుపును వాడటం ద్వారా పసుపులో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. పసుపు దురద సమస్య రాకుండా చేయడంతో పాటు దురదను నివారించడంలో తోడ్పడుతుంది. యాపిల్ వెనిగర్ ను కాటన్ బాల్ సహాయంతో చర్మంపై అప్లై చేయడం ద్వారా దురదకు చెక్ పెట్టవచ్చు.

కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దురదకు చెక్ పెడతాయి. కొబ్బరినూనెలో కర్పూరాన్ని మిక్స్ చేసి దురద ఉన్న చోట అప్లై చేస్తే మంచిది. యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న అలోవేరా వాపు మరియు ఎరుపు, మచ్చలను నివారించడంలో తోడ్పడటంతో పాటు వృద్ధాప్య సమస్యలకు చెక్ పెడుతుంది. శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటే ముల్తానీ మిట్టి శరీరానికి అప్లై చేస్తే శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది.

ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్‌తో మిక్స్ చేసి 20 నిమిషాల తర్వాత కడిగితే ముఖానికి పోషణ అందుతుంది. బర్నింగ్ మరియు దురద సమస్యను నివారించడంలో ముల్తాని మిట్టి తోడ్పడుతుంది. దురద మరియు ఎరుపు దద్దురు సమస్యను నివారించడంలో ముల్తాని మిట్టి ఉపయోగపడుతుంది. వేప ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత దురద ఉన్నచోట రాయాల్సి ఉంటుంది.