ట్యాబ్లెట్లు ఎక్కువగా వేసుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్.. ప్రాణాలకే ప్రమాదమా?

మనలో చాలామంది ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ట్యాబ్లెట్ తీసుకోవడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకుంటూ ఉంటారు. అయితే ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. పరిమితంగా ట్యాబ్లెట్లను తీసుకుంటే నష్టం లేదు కానీ అపరిమితంగా ట్యాబ్లెట్లు తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు.

మితిమీరిన ట్యాబ్లెట్ల వినియోగం ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుగోలు చేయడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. మితిమీరిన మందుల వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు చాలా సందర్భాల్లో మందులు వాడకుండానే తగ్గుతాయి. కొంత సమయం వేచి ఉండటం ద్వారా ఆ ఆరోగ్య సమస్యను సులువుగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి తెలియకుండా మందులను వాడటం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. పరీక్షలు చేయించుకుని రోగం నిర్ధారణ అయిన తర్వాత మందులు వాడితే మంచిది.

తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే మాత్రం ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండటం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.