గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలతో ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా మే 10వ తేదీన ఈ లింక్ యాక్టివేషన్ మొదలైంది. జూన్ నెల 9వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
gujaratmetrorail.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు అహ్మదాబాద్ లో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలు 150 ఉండగా కస్టమర్ రిలేషన్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 46, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 31, జూనియర్ ఇంజనీర్ – ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ ఖాళీలు 28, జూనియర్ ఇంజనీర్ – మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 12, జూనియర్ ఇంజనీర్ – సివిల్ ఉద్యోగ ఖాళీలు 6, మెయింటెయినర్ – ఫిట్టర్ జాబ్స్ 8, మెయింటెయినర్ – ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 60, మెయింటెయినర్ – ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ ఖాళీలు 33 ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 600 రూపాయలు, ఓబీసీ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 150 రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రాత పరీక్ష మరియు గుజరాత్ భాషా పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.