దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే ఎన్నో జాబ్ నోటిఫికేషన్లు విడుదల కాగా వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలు జాబ్ నోటిఫికేషన్లను తాజాగా విడుదల చేశాయి. వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు విడుదల కాగా అర్హత, ఆసక్తి ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో కెరీర్ మొదలుపెట్టాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో 995 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 15వ తేదీ చివరి తేదీగా ఉంది.
జనరల్ కేటగిరీకి రూ.450 దరఖాస్తు ఫీజు కాగా కొన్ని రిజర్వ్డ్ కేటగిరీలకు రూ.550 దరఖాస్తు ఫీజుగా ఉంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వేర్వేరు ఉద్యోగాల కోసం జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయగా డిసెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు, ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 475 ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయగా నవంబర్ నెల 27వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.