ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. bankofbaroda.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జోనల్ సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మేనేజర్ ఇతర ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
మొత్తం 220 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 2023 సంవత్సరం మే నెల 11వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మూడు రోజుల గడువు మాత్రమే ఉండటంతో వేగంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు వేతనం కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.bankofbaroda.in/-/media/project/bob/countrywebsites/india/career/23-04/notification-dated-21-04-2023-reopening-20-40.pdf లింక్ ద్వారా నోటిఫికేషన్ ను చూడవచ్చు.
మొత్తం 11 విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండటం గమనార్హం. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.