ఏపీలో పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగ ఖాళీలు.. వేతనం ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే ఎన్నో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కాగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఎస్ఎస్డీసీ అనంతపూర్ జిల్లాలో పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 20000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

ఏపీఎస్ఎస్డిసి డిస్టిక్ ఆఫీస్ అనంతపురం దగ్గర ఈ మినీ జాబ్ మేళా జరుగుతుండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాల్సి ఉంది. నైపుణ్యాలకు అనుగుణంగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా హాజరు కావచ్చు. ఐటిఐ మరియు డిప్లొమా పాసైన వాళ్లు కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అనంతపురంలో నివశిస్తున్న నిరుద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగులు సైతం ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. చదువు పూర్తై సరైన ఉద్యోగం లభించక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్లు, చిన్న ఉద్యోగంతో కెరీర్ ను మొదలుపెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని భావించే వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

వేర్వేరు కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. లోన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు లైన్ ఆపరేటర్ ఇతర ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొదట తక్కువ వేతనం లభించినా రోజులు గడిచే కొద్దీ ఎక్కువ వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏపీలోని నిరుద్యోగులకు మేలు చేసేలా ఏపీఎస్ఎస్డిసి జాబ్ మేళాలను నిర్వహిస్తోంది.