ఏపీ రేషన్ లబ్ధిదారులకు శుభవార్త…. అమలులోకి వచ్చిన కొత్త నిర్ణయం!

ఏపీ రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం మరొక శుభవార్తను తెలియజేసింది ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ఎండియు వాహనం ద్వారా ప్రజలకు రేషన్ సరుకులను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు బియ్యం మాత్రమే అందిస్తున్నటువంటి ప్రభుత్వం అనంతరం చక్కెర కందిపప్పును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.అయితే తాజాగా రేషన్ లబ్ధిదారులకు గోధుమ పిండిని కూడా అత్యంత తక్కువ ధరకే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విశాఖపట్నంలో ప్రారంభించారు.
రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ అందజేసి.. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గోధుమ పిండికిలో ప్యాకెట్ ధరను 16 రూపాయలుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తోంది.

ప్రస్తుతం లబ్ధిదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తుండగా.. ఇప్పుడు గోధుమ పిండి కూడా ఆ జాబితాలో చేరింది.బయట మార్కెట్లో ఒక కిలో గోధుమ పిండి కొనాలి అంటే దాదాపు 40 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే రేషన్ లబ్ధిదారులకు మాత్రం కేవలం 16 రూపాయలకే కిలో గోధుమ పిండిని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఒక్కో కార్డుకు రెండు కిలోలు చొప్పున గోధుమ పిండిని తీసుకుని సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది.