కేంద్ర ప్రభుత్వం పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్రం కొన్ని పథకాలను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ ఎంతో లాభదాయకంగా ఉంటాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల ఖాతాలలో ప్రభుత్వం ఐదు వేల రూపాయలు జమ చేస్తుంది.
ఈ స్కీమ్ ద్వారా గర్భిణీ మహిళలు 5000 రూపాయలు పొందవచ్చు. 2017 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో జమ చేసిన మొత్తాన్ని మూడు విడతలుగా పొందవచ్చు. గర్భం దాల్చిన 6 నెలలకు రెండో విడతలో భాగంగా 2000 రూపాయలు పొందవచ్చు.
పిల్లలు పుట్టిన తర్వాత చివరి విడత 2,000 రూపాయల మొత్తాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. 19 సంవత్సరాలకు పైబడిన మహిళలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. https://pmmvy.wcd.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు. వెబ్ సైట్ లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్ ను ఎంపిక చేసుకుని మొదటి కాన్పు లేదా రెండో కాన్పు సమాచారం అందించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు మరియు కేటగిరీ వివరాలను నమోదు చేయడం ద్వారా సమాచారాన్ని అందించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.