గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్… గ్యాస్ సిలిండర్ల పై రాయితీ..?

gas

ప్రస్తుత కాలంలో గ్యాస్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రజలందరూ పల్లెల నుండి పట్టణాలకు వలసలు వెళ్లి జీవిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 99 శాతం మంది ప్రజలు గ్యాస్ ఉపయోగించి ప్రతిరోజు ఆహారం వండుకుంటున్నారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలో పెరిగిపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ లపై రాయితీ ఇచ్చి ప్రజలను ఆదుకుంది. ఇక 2023-24 సంవత్సరానికి సంబందించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు.

2023-24 బడ్జెట్ లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలెండర్ల కి కేంద్రం సబ్సిడీని పెంచే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అలానే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ ని కేంద్రం తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకి పెరిగిపోవటం వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్‌ పై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత సంవత్సరంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.5,812 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 12 సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ ని ప్రకటించింది .

ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ కింద ఒక ఎల్పీజీ సిలిండర్‌కు రూ.200 అందిస్తోంది. ఇప్పటికే ఈ స్కీం ద్వారా దాదాపు 9 కోట్ల మంది ప్రజలు బెనిఫిట్స్ ని పొందుతున్నారు. మోదీ సర్కార్‌ 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2021,ఆగస్టు 10న ఉజ్వల 2.0 స్కీం ప్రారంభించింది. ఈ స్కిన్ ద్వారా సామాన్య ప్రజలు ఎంతో డబ్బు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రవేశపెట్టిన బిల్లులో ఈ స్కీం ద్వారా దేశంలో మిగతా కుటుంబాలకు కూడా సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.