గ్యాస్ విగియోగదారులకు గుడ్ న్యూస్… గ్యాస్ ధరపై రూ.300 తగ్గింపు..!

ప్రస్థుత కాలంలో గ్యాస్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో గ్యాస్ ధరలు కూడా రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. రూ.450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1000 దాటింది. ఇలా గ్యాస్ ధరలు రోజురోజుకీ పెరిగిపోవటంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది. ఇలాంటి సమయంలో.. సర్కార్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ఏకంగా రూ.300 సబ్సిడీ ఇవ్వనున్నట్టు పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్‌​పై రూ.300 వరకు సబ్సిడీని అందిస్తున్నట్లుగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్​లో.. ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 126 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి కోట్ల 11,600 పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల విజయాలను వివరించిన రంగస్వామి.. నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి రూ.126 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లుగా తెలిపారు.

కుటుంబ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ ఎల్‌పీజీ సబ్సిడీ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పెరుగుతున్న గ్యాస్ ధరల తో పుదుచ్చేరి ప్రభుత్వం ఈ శుభవార్త తెలియజేసింది. ఈ సబ్సిడీ ద్వారా ప్రజలకు కొంతవరకు ఊరట లభిస్తుంది. ఇదిలా ఉండగా మోడీ ప్రభుత్వం కూడా గ్యాస్ ధరలపై గతంలో సబ్సిడీ ప్రకటించింది. కానీ ఆ సబ్సిడీ రద్దు చేయడంతో ప్రస్తుతం ప్రజలపై మరింత భారం పడింది.