కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో రకాల పథకాల ద్వారా రైతులకు ఎంతో ఆదాయాన్ని అందిస్తున్నాయి. రైతులకు వ్యవసాయంలో చేదోడుగా నిలుస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రైతుల ఖాతాలో 6000 రూపాయలను జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇలా ఏడాదిలో మూడు సార్లు 2000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ రకాల పథకాల ద్వారా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తూ రైతులకు ఎంతో చేదోడుగా నిలుస్తున్నారు.
ఈ విధంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుబంధు రైతు భరోసా పథకాల ద్వారా రైతులకు చేతులుగా నిలుస్తున్నారు ఇప్పుడు కర్ణాటక ప్రఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం రైతుల కోసం ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు రైతులు మూడు లక్షల వరకు వడ్డీ రహిత రుణాలను తీసుకునేవారు అయితే ఈ వడ్డీ రహిత రుణాలను ఐదు లక్షలకు పెంచుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ క్రమంలోనే 2023_24 వార్షిక బడ్జెట్ లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి రైతులు వడ్డీ భారం లేకుండా రూ. 5 లక్షల వరకు లోన్ వస్తుంది. షార్ట్ టర్మ్ లోన్స్ పరిమితిని పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. రూ. 3 లక్షల నుంచి ఈ లోన్ పరిమితిని రూ. 5 లక్షలకు ఇక పెంచనున్నారు. లోన్ లిమిట్ ని పెంచడం వలన 30 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం రానుంది. భూ సిరి అనే ఓ కొత్త పథకాన్ని కూడా తీసుకు రానున్నారు.ఇలా వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణాలు ఇవ్వడంతో కర్ణాటక రైతులు ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.