మనలో చాలామంది ప్రతిరోజూ కాకపోయినా వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్లడానికి ఇష్టపడతారు. దేవుడికి మన కష్టాలు చెప్పుకుంటే ఆ కష్టాలు తీరతాయని చాలామంది భావిస్తారు. గుడికి వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంటుంది. గుడికి వెళ్తే ప్రశాంతత కలిగే అవకాశం ఉంటుందని పెద్దలు సైతం చెబుతున్నారు. అయితే దేవాలయానికి వెళ్లే సమయంలో కొన్ని తప్పులు అస్సలు చెయ్యకూడదు.
మాంసాహారం తిన్న తర్వాత దేవాలయానికి అస్సలు వెళ్లకూడదు. దేవాలయానికి వెళ్లేవాళ్లు దేవాలయ ప్రాంగణంలోకి చెప్పులు వేసుకుని వెళ్లరాదు. దేవుడిని పూజించడానికి వెళ్లే సమయంలో వస్త్రధారణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడిని ప్రార్థించే సమయంలో ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. ఆలయానికి వెళ్లే సమయంలో దేవుడిని ఎలా ప్రార్థించాలో కూడా తెలుసుకోవాలి.
దేవాలయానికి వెళ్లే సమయంలో విగ్రహాలను తాకడం మంచిది కాదు. విగ్రహాలను తాకడం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది. భగవంతునిపై మనస్సును లగ్నం చేస్తే మాత్రమే మానసిక ప్రశాంతత లభించే ఛాన్స్ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఎవరిపై కోపం ప్రదర్శించకూడదు. సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆలయానికి వెళితే మంచిది.
ఆలయంలో ఉన్న సమయంలో ఫోన్ ను సైలెంట్ గా ఉంచుకుంటే మంచిది. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఆలయంలో ఎలాంటి పనులు చేయరాదు. భక్తితో దేవుడిని పూజిస్తే మాత్రం మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.