దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 17 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆఫీసర్- హెచ్‌ఆర్ ఉద్యోగ ఖాళీలు 8 ఉంటే ఎగ్జిక్యూటివ్- మార్కెటింగ్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్- హెచ్‌ఆర్ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్- ఐఆర్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా ఎగ్జిక్యూటివ్- మార్కెటింగ్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్, రెండో ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్, ఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూదిల్లీ అడ్రస్ కు అర్హా, ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. నవంబర్ నెల 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం కూడా భారీ రేంజ్ లోనే ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరుగుతుండటం గమనార్హం.