ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఏకంగా 18,000 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ భర్తీ చేయనున్నారు. మరో 10 రోజులు దరఖాస్తు గడువు ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, హెడ్ క్లర్క్/అసిస్టెంట్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్ గ్రేట్, సూపర్‌ఇన్‌టెండెంట్ ఉద్యోగ ఖాళీలను జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీలను బట్టి వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
esic.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేసి రిక్రూట్‌మెంట్ ఆప్షన్ ను ఎంచుకుని అప్లై నౌ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ.1,42,400 వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎక్కువ వేతనం లభిస్తున్న నేపథ్యంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పది, డిగ్రీ అర్హతలతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ మంచి ఆప్షన్ అవుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.