కళ్లు మసకబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు చెబుతారు. అస్పష్టమైన దృష్టి, మంట, దురద, ఎరుపు, కాంతికి సున్నితత్వంతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. తగినంత స్థాయిలో కన్నీళ్లు కళ్లలో ఉత్పత్తి కానప్పుడు కళ్లు పొడిబారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కన్నీళ్లు కళ్లను తడిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కళ్లు అంటువ్యాధులు, మురికి, దుమ్ము వంటి చికాకు కలిగించే వాటి నుండి రక్షించడంలో ఉపయోగపడతాయి. కళ్లలో ఏదైనా ఇరుక్కున్నట్టు అనిపిస్తే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకోవడం ద్వారా కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. స్లిట్ ల్యాంప్ పరీక్ష, కార్నియా, టియర్ ఫిల్మ్, డయాగ్నస్టిక్ స్టెయినింగ్, టియర్ ఫిల్మ్ బ్రేక్ అప్ టైమ్ పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యానికి మంచిది.

తేలికపాటి పొడి కంటి లక్షణాలున్నవారికి కృత్రిమ కన్నీళ్లు అని పిలిచే, ప్రిస్క్రిప్షన్ కంటి చుక్కలను ఉపయోగించడం ద్వారా కళ్లు లూబ్రికేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫిష్ ఆయిల్ లేదా ఒమేగా 3 క్యాప్సూల్స్ రోజుకు రెండు నుండి మూడు సార్లు, కళ్ళలో తేమను ఉంచే గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్స్‌లు, రెస్టాసిస్, టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్, ఓరల్ టెట్రాసైక్లిన్, డాక్సీసైక్లిన్ వంటి మందులు, టియర్ డ్రైనేజ్ డక్ట్‌లలో ఉంచిన చిన్న ప్లగ్‌లు మరింత తీవ్రమైన పొడి కంటి లక్షణాల నుండి కోలుకోవడానికి ఉపయోగపడతాయి.

జీవనశైలిలో మార్పులు కూడా పొడి కంటి లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో తోడ్పడతాయని చెప్పవచ్చు. పొగ, గాలి, ఎయిర్ కండిషనింగ్‌ను నివారించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలెర్జీ, జలుబు మందులను తక్కువగా తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.