ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా డీఆర్డీవో నుంచి వరుసగా జబ్ నోటిఫికేషన్లు వెలువడుతుండగా తాజాగా డీఆర్డీవో నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. సైంటిస్ట్-బి కేటగిరీ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 29వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. www.drdo.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డీఎస్‌టీ, ఏడీఏ, సీఎంఈ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. డీఆర్‌డీవో మెయిన్ విభాగంలో 181 ఉద్యోగ ఖాళీలు ఉండగా డీఎస్‌టీ విభాగంలో 11 ఉద్యోగ ఖాళీలు, ఏడీఏ విభాగంలో 6 ఉద్యోగ ఖాళీలు, సీఎంఈ విభాగంలో 6 సైంటిస్ట్ బి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. www.drdo.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలను కాల్ లెటర్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేశానికి అత్యాధునిక ఆయుధాల తయారీ కోసం డీఆర్డీవో కష్టపడుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.