మెడిసిన్స్ కొనుగోలు చేసే సమయంలో ఈ తప్పులు చేయొద్దు… ఈ మందులతో ప్రాణాలకే ప్రమాదం!

మనలో చాలామంది ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మందులపై ఆధారపడుతూ ఉంటారు. ఎక్కువగా మందులు వాడటం వల్ల తాత్కాలింగా హెల్త్ బెనిఫిట్స్ పొందినా దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రపంచ దేశాలకు మందులను సరఫరా చేసే ప్రముఖ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అయితే మన దేశంలో చాలా చోట్ల నకిలీ మందులు అమ్ముతున్నారు.

నకిలీ ఔషధాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశాలు కూడా ఉంటాయి. నిజమైన మందులతో సమానంగా కనిపించేలా నకిలీ మందులను ప్యాక్ చేయడం జరుగుతుంది. నకిలీ మందులకు సంబంధించి ప్యాకేజింగ్, టాబ్లెట్ ఆకారం, సీసా ఆకారం, పరిమాణం, రంగులు కాపీ చేయడం జరుగుతుంది. బూజు పట్టిన మాత్రలు లేదా అదనపు పొడి లేదా స్ఫటికాలు కలిగిన టాబ్లెట్ల విషయంలో జాగ్రత్త వహించాలి.

మాత్రలు పగిలిపోయినా, బుడగలు పడిన పూత ఉన్నా, లేదా చిరిగిపోయినా జాగ్రత్త వహిస్తే మంచిది. మెడిసిన్స్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లు కచ్చితంగా అడిగి తీసుకుంటే మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. మందుల లేబుల్ చదవడం ద్వారా దాని నాణ్యత, ప్రామాణికత గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. మందులపై క్యూఆర్ కోడ్ లేని పక్షంలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.

మందుల ప్యాకింగ్ పై హెల్ప్‌లైన్ నంబర్ తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. వైద్యుడి సలహా లేకుండా ఏదైనా ఔషధాన్ని చిన్నగా లేదా పెద్ద పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగించే ఛాన్స్ అయితే ఉంటుంది. మందుల ప్యాకేజీలు మరియు లేబుళ్ళపై ఉన్న మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా నకిలీ మందులు కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడవచ్చు.