ఇంటి నుంచి చెడు వాసన వస్తుందా…ఈ సహజ చిట్కాలతో చెడు వాసనను తరిమికొట్టండి!

సాధారణంగా మనం ఇంట్లో ఎంత శుభ్రంగా పెట్టుకున్న మన ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల మన ఇంట్లోకి చెడు వాసన రావడం సర్వసాధారణం ఇలా ఇంట్లో దుర్వాసన కనక వస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏమాత్రం మనశాంతి ఉండదు. ఇలా దుర్వాసన సమస్య కనుక ఇంట్లో అధికంగా వేధిస్తూ ఉంటే ఆ దుర్వాసన సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ సహజ చిట్కాలతో చెడు వాసనను తరిమికొట్టవచ్చు.

చాలామంది ఇంటి నుంచి వచ్చే ఈ చెడు వాసనను తరిమికొట్టడానికి మార్కెట్లో స్ప్రేస్ వాడుతూ ఉంటారు అయితే ఇది కొంత వరకు మాత్రమే సువాసన వచ్చినప్పటికీ తిరిగి అదే దుర్వాసన వస్తూ ఉంటుంది. అందుకే సహజ చిట్కాలతో ఈ చెడు వాసన నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ముందుగా మన ఇంటిని ఇంటి లోపల వస్తువులన్నిటిని కనీసం రెండు లేదా మూడు నెలలకు ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కిటికీల తెరిచి ఉంచడం వల్ల ఇంట్లో చెడు దుర్వాసనలు బయటికి వెళ్లి గాలి వెళ్తురు సక్రమంగా అందుతుంది.

బేకింగ్ సోడా చెడు వాసనను గ్రహించి చుట్టూ ఉన్న వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది.కాబట్టి చెడు వాసనను త్వరగా పోగొట్టుకోవడానికి ఇంట్లో ప్రతి మూలలో బేకింగ్ సోడా ఉంచటం మంచిది. అలాగే రిఫ్రిజిరేటర్‌లో బేకింగ్ సోడా కంటైనర్‌ను ఉంచడం వల్ల ఇతర ఆహార పదార్థాల దుర్వాసన గ్రహించి ఫ్రిజ్లో ఉండే ఆహార పదార్థాలను ఫ్రీజ్ ను ఎప్పుడు తాజాగా ఉంచుతుంది. ఇక మన ఇంటి ఆవరణంలో సువాసన వెదజల్లే తులసి, చియా మొక్క, పుదీనా, కొత్తిమీర, లెమన్ గ్రాస్ వంటి మొక్కలను పెంచుకోవడం వల్ల వీటినుంచి వెలుపడే సహజ సువాసనలు మన చుట్టూ ఉన్న వాతావరణం తాజాగా ఉంచుతాయి. ఇలా ఈ సహజ పద్ధతులతో ఇంట్లో చెడు వాసనను తరిమికొట్టవచ్చు.